కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న సోమవారం బాధ్యతలు స్వీకరించి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకధికారి చాహత్ బాజ్ పాయ్ని మర్యాదపూర్వకంగా కలిసి బోకే అందజేశారు. అనంతరం బల్దియాలో జరిగే గ్రీవెన్స్ సెల్లో పాల్గొని ఆర్జీలను స్వీకరించారు.
