కేసీఆర్ కొడుకుగా పుట్టినందుకే కేటీఆర్‌‌‌‌ ను భరించాలా? : విప్ అద్దంకి దయాకర్

కేసీఆర్ కొడుకుగా పుట్టినందుకే  కేటీఆర్‌‌‌‌ ను భరించాలా? : విప్ అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కొడుకుగా పుట్టినందుకే కేటీఆర్‌‌‌‌ను తెలంగాణ సమాజం భరించాల్సి వస్తోందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్‌‌‌‌కు రాజకీయ భవిష్యత్తే ఉండేది కాదని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పదేళ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు దోపిడీ చేసుకునేందుకు తాము అవకాశం ఇచ్చామని కేటీఆర్ ఒప్పుకున్నారని దయాకర్ ఆరోపించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో పూర్తి బాధ్యతలు అప్పగించడం తప్పంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో కొంతమంది గిరిజన ఎమ్మెల్యేలు నిధుల కోసం అడిగినా పట్టించుకోలేదని ఆరోపించారు. గిరిజన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ చూపిన వివక్షకు ఇదే నిదర్శనమని అన్నారు. పైసలు ఇచ్చి గణేశ్ నిమజ్జనంలో పాటలు పెట్టించుకునే రాజకీయాలు కాకుండా.. నిజాయతీగా పనిచేసి ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని కేటీఆర్‌‌‌‌కు సూచించారు.