కవితపై అదనపు చార్జిషీట్ .. పరిగణనలోకి తీసుకున్న ట్రయల్ కోర్టు

కవితపై అదనపు చార్జిషీట్ .. పరిగణనలోకి తీసుకున్న ట్రయల్ కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్  స్కామ్  కేసులో బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన అడిషనల్  చార్జిషీట్ ను ట్రయల్  కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. ఆమె తిహార్  జైలులో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ ఆమెను అదుపులోకి తీసుకుంది. కోర్టు అనుమతితో కవితను కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఆ తర్వాత ఆమెతో పాటు మరో నలుగురిపై సీబీఐ అదనపు చార్జిషీటును దాఖలు చేసింది. 

అయితే,  సీబీఐ దాఖలు చేసిన అడిషనల్  చార్జిషీటు సరిగా లేదని, తనకు బెయిల్  ఇవ్వాలని కవిత మరోసారి ట్రయల్  కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన స్పెషల్  జడ్జి కావేరి బవేజా... ఆ బెయిల్  పిటిషన్ పై ఆగస్టు 5న తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం లిక్కర్  స్కామ్  కేసులో సీబీఐ దాఖలు చేసిన అడిషనల్  చార్జిషీటును పరిగణనలోకి తీసుకుంటున్నామని బవేజా వెల్లడించారు. ఈనెల 26న ఆ చార్జిషీటుపై తదుపరి విచారణ చేపడతామని తెలిపారు.