హరీశ్రావు చదివింది పాలిటెక్నిక్..ఇంజినీర్లా ఫోజులు కొడుతున్నడు..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హరీశ్రావు చదివింది పాలిటెక్నిక్..ఇంజినీర్లా ఫోజులు కొడుతున్నడు..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైద‌‌రాబాద్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్ రావు చదివింది కేవలం పాలిటెక్నిక్​మాత్రమేనని, కానీ పెద్ద ఇంజినీర్​లా ఫోజులు కొడుతున్నాడని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. త‌‌న మెద‌‌డు అంతా రంగ‌‌రించి నిర్మించాన‌‌ని మామ కేసీఆర్​చెపితే హ‌‌రీశ్​రావు ఆయ‌‌న‌‌కు ఇప్పుడు తోడ‌‌య్యాడని ఎద్దేవా చేశారు. ఎల్లంప‌‌ల్లి తెలంగాణ‌‌కు గుండెకాయ లాంటిదని పేర్కొన్నారు.

జులై 28, 2004న నాటి సీఎం వైఎస్ఆర్ ఎల్లంప‌‌ల్లి ప్రాజెక్టుకు శంకుస్థాప‌‌న చేశారని గుర్తుచేశారు. 2004  నుంచి 2009 మ‌‌ధ్యనే బ్యారేజీ, మెయిన్ కెనాల్స్ పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పుడు హరీశ్​ రావు ఎల్లంపల్లి బ్యారేజ్ నిర్మాణానికి రాళ్లు తానే మోసిన‌‌ట్లుగా అబద్దాలు చెబుతున్నాడని, ఎల్లంపల్లిని కూడా త‌‌మ ఖాతాలో వేసుకోవ‌‌డానికి ప్రయ‌‌త్నం చేస్తున్నారని మండిపడ్డారు.