నమ్మించి గొంతు కోసిన చరిత్ర మీది..కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

నమ్మించి గొంతు కోసిన చరిత్ర మీది..కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి బాడీగార్డులా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నమ్మిన నాయకుడి కోసం ప్రాణమిచ్చే తత్వం సీఎం రేవంత్ రెడ్డిదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘మీలా నమ్మించి మోసం చేసే వ్యక్తులం మేం కాదు. నమ్మించి గొంతు కోసిన చరిత్ర మీది’’ అని మండిపడ్డారు.

తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో విలీనం చేస్తామని చెప్పి సోనియా గాంధీని మోసం చేశారని కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియమ్మ కాళ్లు మొక్కి, ఆ తర్వాత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు వెన్నుపోటు పొడిచింది తమరేనని మండిపడ్డారు. సోనియా గాంధీ ఆత్మకథలో నమ్మక ద్రోహులకు స్థానం ఉండదని, కనీసం ఆమె పేరు ఎత్తే నైతిక అర్హత కూడా కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు లేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు. చిట్‌‌‌‌‌‌‌‌చాట్ పేరుతో అర్థం లేని మాటలు ఆయన మాట్లాడటం మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరూ పట్టించుకోకపోవడంతో, కేవలం మీడియాలో నిలవాలనే ఆరాటంతోనే కేటీఆర్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.