- ప్రారంభించిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పి.శ్యామ్ కోషి
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ప్రాంగణంలో అత్యవసర సమయాల్లో గుండెపోటుకు గురైన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు 5 ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్(ఏఈడీ) యంత్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పి.శ్యామ్ కోషి మంగళవారం వాటిని ప్రారంభించారు. యంత్రాల ఏర్పాటుకు సహకరించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, జస్టిస్ టి.మాధవీ దేవి, జస్టిస్ ఎస్.నంద, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ నాగేశ్ భీమపాక, జస్టిస్ కె.శరత్, జస్టిస్ ఎస్.చలపతిరావు హాజరయ్యారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సెక్రటరీ పి.శ్రవణ్ కుమార్ గౌడ్, వైస్ప్రెసిడెంట్డీఎల్ పాండు, జాయింట్సెక్రటరీ పి.కృష్ణ కీర్తన, ట్రెజరర్ బాలాజీ బానోత్ తదితరులు పాల్గొన్నారు.
