ఆదిలాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ పనుల్లో వేగం.. వచ్చే వీకెండ్కల్లా నోడల్ అధికారులు

ఆదిలాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ పనుల్లో వేగం.. వచ్చే వీకెండ్కల్లా నోడల్ అధికారులు

న్యూఢిల్లీ, వెలుగు: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పనులు వేగవంతం అవుతున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ పనులతో పాటు కార్యాచరణను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ వారాంతానికల్లా రక్షణశాఖ, పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. అలాగే, జాయింట్ యూజర్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), మాస్టర్ ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేయాలని డిసైడ్ చేసినట్టు స్పష్టం చేశారు. 

శనివారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో.. రక్షణ, విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారని, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించినట్టు కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా.. దేశ రక్షణ పరంగా వ్యూహాత్మక ప్రాంతమైన ఆదిలాబాద్‎లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు, ఎయిర్‌‌‌‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు అవసరాన్ని వివరించినట్టు చెప్పారు. 

అందువల్ల ఈ రీజనల్ కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఆదిలాబాద్ లో జాయింట్ యూజర్ ఎయిర్‌‌‌‌ఫీల్డ్ (జేయూఏ)ను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారన్నారు. ఇందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. 

తుది దశకు..

ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం రక్షణ, పౌర విమానయాన శాఖలు, తెలంగాణ ప్రభుత్వం మధ్య పలు దఫాలు సమావేశాలు జరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. వరుస సమావేశాలు, లేఖలు, నిరంతర సమన్వయం తర్వాత ఈ పాజెక్ట్  తుది దశకు చేరుకుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ స్థలాన్ని పరిశీలించినట్టు చెప్పారు. 

2.75 కి.మీ రన్ వే నిర్మాణం అవసరమని నిర్ధారించామన్నారు. అలాగే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న 369.45 ఎకరాల భూమికి అదనంగా.. రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లో ట్రైనర్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లు, విజిటింగ్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ పార్కింగ్, వెదర్ షెల్టర్స్, ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ హ్యాంగర్స్, ఆపరేషనల్ కాంప్లెక్స్, ట్రైనింగ్ ఫెసిలిటీస్, మెయింటేనెన్స్ ఇన్‌‌‌‌ఫ్రా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు. 

పౌర సేవలకు సంబంధించి ఒక సివిల్ టెర్మినల్‌‌‌‌, మెయింటనెన్స్ అండ్ రిపైర్ ఆపరేషన్స్(ఎంఓఆర్) ఫెసిలిటీని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఏర్పాటు చేస్తుందని వివరించారు. అలాగే, అక్కడ పనిచేసే.. ఎయిర్‌‌‌‌ఫోర్స్ సిబ్బందికి అవసరమైన నివాస, ఇతర మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష సాకారం కానుందన్నారు.