‘క్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవిష్యత్తుకు భద్రత.. రాబోయే 20, 30 ఏండ్ల అవసరాల కోసమే చట్టం: మంత్రి శ్రీధర్ బాబు

‘క్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవిష్యత్తుకు భద్రత.. రాబోయే 20, 30 ఏండ్ల అవసరాల కోసమే చట్టం: మంత్రి శ్రీధర్ బాబు
  • రాబోయే 20, 30 ఏండ్ల అవసరాల కోసమే చట్టం
  • అపెక్స్ కౌన్సిల్ కేవలం సలహా సంఘమే.. 
  • అధికారాలన్నీ కార్పొరేషన్లకే 
  • ప్రాపర్టీ ట్యాక్స్ గరిష్టంగా 10 శాతమే పెంపు 
  • అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగర భవిష్యత్తును, రాబోయే 20, 30 ఏండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకునే సమగ్ర ప్రణాళికతో ‘క్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చట్టాన్ని తీసుకువచ్చినట్టు మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ అనేది ఎలాంటి పెత్తనం చెలాయించే పవర్ సెంటర్ కాదని.. అది కేవలం ఒక అడ్వైజరీ కౌన్సిల్ మాత్రమేనని తేల్చిచెప్పారు. అసలైన పాలనాపరమైన అధికారాలన్నీ ఆయా కార్పొరేషన్లకే పూర్తిస్థాయిలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో క్యూర్ బిల్లుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. 

నగరంలో మెరుగైన పాలన కోసం ఏర్పాటు చేస్తున్న మూడు కార్పొరేషన్ల మధ్య పాలనాపరమైన యూనిఫార్మిటీ ఉండేందుకు ఈ క్యూర్ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. క్యూర్ బిల్లు ద్వారా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను బ్లూ సిటీ, గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే అపెక్స్ కౌన్సిల్ కేవలం వివిధ శాఖల మధ్య సమన్వయం, సలహాల కోసం మాత్రమే పనిచేస్తుందని, స్థానిక సంస్థల హక్కులను ఎవరూ హరించడం లేదని ఆయన సభకు వివరించారు.

ప్రాపర్టీ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌పై తప్పుడు ప్రచారం

ప్రాపర్టీ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే క్యాపిటల్ వాల్యూ మెథడ్ ద్వారానే ఆస్తిపన్ను లెక్కిస్తున్నారని, ప్రస్తుత క్యూర్ పరిధిలోనూ అదే విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మొదట బిల్లులో మాక్సిమం ప్రాపర్టీ ట్యాక్స్ పెంపును 20 శాతంగా పెట్టడం జరిగిందని.. అయితే, దాన్ని 20% కాకుండా కేవలం 10 శాతానికి మాత్రమే పరిమితం చేస్తూ అఫీషియల్ అమెండ్‌‌‌‌‌‌‌‌మెంట్ చేశామని తెలిపారు. 

ప్రతి ఏడాది 10% ట్యాక్స్ పెరుగుతుందనేది పూర్తిగా అవాస్తవమని, అసలు ఆ నిబంధనే ఎక్కడా లేదన్నారు. ఇదంతా కేవలం ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీఆర్ కామన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ కోసం ప్రత్యేకంగా బిల్ట్ నౌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా 2034 నాటికి రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.