జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ హైదరాబాద్‌లో శనివారం హెక్టర్ టోమహాక్ ఎలక్ట్రిక్, పీహెచ్‌ఈవీ మోడల్ కార్లను విడుదల చేసింది. ఇందులోని 69.2 కిలోవాట్ల బ్యాటరీ ఇంటికి కూడా కరెంటును అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. టోమహాక్ ప్రారంభ ధర బ్యాటరీ రెంటల్ విధానంలో రూ.13.99 లక్షలు.
కిలోమీటరుకు రూ.4.90 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లించాలి. ఫుల్చార్జ్తో 517 కిలోమీటర్లు వెళ్తుంది. తొలిసారిగా పీహెచ్‌ఈవీ (పెట్రోల్ ఇంజిన్+బ్యాటరీ) వేరియంట్‌ను కూడా తీసుకొచ్చారు. దీని ధర రూ.21.79 లక్షలు. బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.3.20 ఉంటుంది. ఇది ఏకంగా 1,100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
