సుప్రియ హ్యాట్రిక్‌ గోల్స్.. సెమీస్‌‌‌‌లో సౌత్‌‌‌‌ కొరియాపై ఇండియా ఘన విజయం

సుప్రియ హ్యాట్రిక్‌ గోల్స్.. సెమీస్‌‌‌‌లో సౌత్‌‌‌‌ కొరియాపై ఇండియా ఘన విజయం

మోఖి (చైనా): జూనియర్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌ హాకీ టోర్నీలో ఇండియా టీమ్‌‌‌‌ అదరగొట్టింది. డ్రాగ్ ఫ్లికర్‌‌‌‌ సుప్రియ (16, 33, 56వ నిమిషం) హ్యాట్రిక్‌‌‌‌ గోల్స్‌‌‌‌తో చెలరేగడంతో శనివారం జరిగిన సెమీస్‌‌‌‌లో ఇండియా 5–1తో సౌత్‌‌‌‌ కొరియాపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. మధు సిదార్‌‌‌‌ (13వ ని), సుఖ్‌‌‌‌వీర్‌‌‌‌ కౌర్‌‌‌‌ (20వ ని) ఇండియాకు మరో రెండు గోల్స్‌‌‌‌ అందించారు. 

కొరియా తరఫున యూరీ జోంగ్‌‌‌‌ (41వ ని) ఏకైక గోల్‌‌‌‌ సాధించింది. మ్యాచ్‌‌‌‌ ఆరంభం నుంచి ఇరుజట్లు ఆచితూచి ఆడినా.. క్రమంగా ఇండియా పట్టు బిగించింది. దాంతో తొలి క్వార్టర్‌‌‌‌లోనే గోల్‌‌‌‌ కొట్టింది. రెండో క్వార్టర్‌‌‌‌ నుంచి మరింత జోరు చూపెడుతూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. తొలి 3–0తో తొలి హాఫ్‌‌‌‌ను ముగించింది.