బర్మింగ్‌హామ్: చిన్న లక్ష్య ఛేదనలో కెప్టెన్ జో రూట్ (62 నాటౌట్), జోర్డాన్ కాక్స్ (59 నాటౌట్) చెలరేగడంతో.. నాలుగు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. పాక్ నిర్దేశించిన 130 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు శనివారం బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 24.2 ఓవర్లలో 130/2 స్కోరు చేసింది.
తొలి ఓవర్‌లోనే బెన్ డకెట్ (0), ఎమిలియో గే (0) డకౌటయ్యారు. దాంతో 2/2 స్కోరు వద్ద వచ్చిన రూట్, కాక్స్.. పాక్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్‌ను రొటేట్ చేశారు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టి మూడో వికెట్‌కు 128 రన్స్ జోడించి విజయాన్ని అందించారు. డాన్ లారెన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మహ్మద్ అబ్బాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
