న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోన్న ‘అలయ్ బలయ్’ వేడుకులకు రావాలని పలువురు కేంద్ర మంత్రులు, హర్యానా సీఎంను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీని మర్యాదపూర్వకంగా కలిసి, అలయ్ బలయ్2026 వేడుకలకు రావాలని ఆహ్వానించారు. అలాగే, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) బీఎల్ సంతోష్‌ను కూడా ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.
గొప్ప ఉద్దేశంతో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని కాంక్షిస్తూ నేతలు శుభాకాంక్షలు తెలిపినట్లు దత్తాత్రేయ ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రజల మధ్య స్నేహభావం, సామాజిక సామరస్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఏటా ఈ వేడుకులకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
