‘మహేంద్రగిరి వారాహి’ చిత్రానికి గ్రౌండ్ లెవల్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని టీమ్ చెప్పింది. సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కలిపు మధు, లక్ష్మణ్ కలిసి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ శనివారం డివైన్ బ్లాక్ బస్టర్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు మొదటి నుంచీ మౌత్ టాక్ బాగుంది. చాలాకాలం తర్వాత నా స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి కంగ్రాజులేషన్స్ అందుకున్నా’ అని చెప్పాడు. ఈ చిత్రంలోని క్లైమాక్స్ ట్విస్ట్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి చెప్పాడు. ప్రతి షోకి సేల్స్ పెరుగుతున్నాయని నిర్మాతలు అన్నారు.
