గ్లోబల్ వేదికపై డోరతీ.. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కీర్తి సురేష్ మూవీ..

గ్లోబల్ వేదికపై డోరతీ.. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కీర్తి సురేష్ మూవీ..

కీర్తి సురేష్ లీడ్ రోల్‌‌‌‌లో రూపొందుతున్న తమిళ చిత్రం ‘డోరతీ’.  కార్తీక్ సుబ్బరాజ్‌‌‌‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సనాంత్, రిషికాంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్‌‌‌‌ వచ్చింది. ఇక థియేట్రికల్‌‌‌‌ రిలీజ్‌‌‌‌కు ముందే ఈ చిత్రానికి ఓ అరుదైన గౌరవం దక్కింది. కెనడాలో జరిగిన ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్‌‌‌‌ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌ (TIFF)లోని సెంటర్‌‌‌‌‌‌‌‌పీస్‌‌‌‌ విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.  

ఈ వరల్డ్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌కు రాయల్‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌లో హాజరైన కీర్తి సురేష్‌‌‌‌.. తనదైన గ్లామర్‌‌‌‌‌‌‌‌తో సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌ చేసింది. ఆమెతో పాటు సనత్‌‌‌‌, రిషికాంత్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్,  నిర్మాతలు గునీత్ మోంగా కపూర్, అచిన్‌‌‌‌ జైన్‌‌‌‌ హాజరయ్యారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌‌‌‌ రావడంతోపాటు ఆడియన్స్‌‌‌‌ స్టాండింగ్‌‌‌‌ ఒవేషన్‌‌‌‌ ఇచ్చారు.  

దశాబ్ద కాలంలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌లో పాల్గొన్న తమిళ చిత్రం ఇదే కావడం విశేషం.  ఇలాంటి గ్లోబల్‌‌‌‌ వేదికపై తమ సినిమాను ప్రదర్శించడం ఎంతో గర్వంగా ఉందని టీమ్ సంతోషం వ్యక్తం చేశారు.  ఈనెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.