వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని నాగపూర్ రైల్వే ఎస్పీ మంగేష్ షిండే కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేయగా, ఈవో ఇమ్మడి భాస్కర్ పట్టు వస్త్రాలతో సత్కరించారు. గైడ్ విజయ్ ఆలయ చరిత్ర, శిల్పకళా విశిష్టతను వివరించారు. అనంతరం రామప్ప సరస్సులో బోటింగ్ చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న గ్రూప్-2 అధికారులు ‘భారత్ దర్శన్’లో భాగంగా రామప్పను సందర్శించారు.
వారికి ఏటీపీవో కుసుమ సూర్యకిరణ్, గైడ్ విజయ్ ఆలయ విశిష్టతను వివరించారు. పురావస్తు శాఖ కన్జర్వేషన్ డైరెక్టర్ శ్రవణ్ కుమార్, సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ కూడా రామప్పను సందర్శించి ఇటీవల పునరుద్ధరించిన సోమసూత్రం, ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట అధికారులు, టూరిస్ట్ పోలీసులు, దేవాదాయ, పురావస్తు, పర్యాటక శాఖల సిబ్బంది ఉన్నారు.
