ఇక క్యాష్ ఆన్ డెలివరీలపై రూ.5 ఎక్స్‌‌ట్రా.. జొమాటో ఛార్జీల మోత

ఇక క్యాష్ ఆన్ డెలివరీలపై రూ.5 ఎక్స్‌‌ట్రా.. జొమాటో ఛార్జీల మోత

న్యూఢిల్లీ: ఆన్‌‌‌‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌‌‌ఫామ్ జొమాటో  క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) ఎంచుకునే కస్టమర్లపై అదనపు ఛార్జీలు వేస్తోంది. ఆర్డర్‌‌‌‌‌‌‌‌పై రూ.5 నుంచి రూ.20 వరకు ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ పేరిట వసూలు చేస్తోంది. యాప్‌‌‌‌లోని బిల్లు వివరాల్లో ఈ చార్జీని ప్రత్యేకంగా చూపిస్తున్నారు.

ఎక్కువ మందికి రూ.5 కనిపిస్తుండగా, కొన్ని ఆర్డర్లకు రూ.7 నుంచి రూ.20 వరకు బిల్ వేస్తున్నట్లు స్క్రీన్‌‌‌‌షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పేమెంట్ చేస్తే మాత్రం ఈ చార్జీ ఉండదు. ఇప్పటికే ఆర్డర్‌‌‌‌కు రూ.14.99 ప్లాట్‌‌‌‌ఫామ్ ఫీజు, అదనంగా రెస్టారెంట్ ప్యాకేజింగ్, జీఎస్‌‌‌‌టీ వసూలు చేస్తుండగా.. ఇప్పుడీ సీఓడీ ఛార్జీతో కస్టమర్లపై భారం పెరిగింది. ప్రస్తుతం జొమాటో రోజుకు 23 నుంచి 25 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తోంది. ఫుడ్ డెలివరీలోకి  రాపిడో, ఫ్లిప్‌‌‌‌కార్ట్  ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.