నగేశ్​కు టికెట్ ఇవ్వాలని నేను చెప్పలేదు : పాయల్ శంకర్

నగేశ్​కు టికెట్ ఇవ్వాలని నేను చెప్పలేదు : పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు :  బీఆర్‌‌‌‌ఎస్ నాయకుడు గొడెం నగేశ్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని ఆ పార్టీ నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనే విషయంలో పార్టీ అధిష్టానం, తన కంటే ఎక్కువగా లక్ష రెట్లు చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌లోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ నగేశ్​కు ఇవ్వాలని తాను చెప్పలేదన్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఎవరికిచ్చినా గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు.