ఎంఐఎంకు భయపడే యాత్రకు పర్మిషన్ ఇస్తలే : ఎంపీ బాపూరావు

ఎంఐఎంకు భయపడే యాత్రకు పర్మిషన్ ఇస్తలే : ఎంపీ బాపూరావు

ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం అప్రజాస్వామికమని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఎంఐఎంకు భయపడే యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వట్లేదని విమర్శించారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక చివరి క్షణంలో అనుమతి నిరాకరిస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారని మండిపడ్డారు.

పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతుందని సోయం బాపురావు స్పష్టం చేశారు. బీజేపీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ వణికిపోతున్నారన్నారు. రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఖాసిం రిజ్వికి తీసిపోకుండా డీజీపీ మహేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ని అడ్డుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.