ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ కోసం భారీ ఈవెంట్లు

ఆదిపురుష్  ట్రైలర్ రిలీజ్ కోసం భారీ ఈవెంట్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రామాయణ గాధ ఆదారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్ పనుల్లో స్పీడ్ పెంచారు.  అందులో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన ప్రభాస్, కృతి సనన్ పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్స్ తో సినిమాపై అంచనాలు కూడా నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం రంగం సిద్ధం చేశారు యూనిట్. అదికూడా ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతిలో.  ఈ ఈవెంట్ ను జూన్ 1న భారీగా నిర్వహించేలా  ప్లాన్ చేస్తున్నారు.  ఆ తర్వాత భద్రాచలంలో కూడా మరో భారీ ఈవెంట్ ప్లాన్ చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ వరకు అయోధ్య, వారణాసి లాంటి పవిత్ర స్థలాల్లో కూడా ఆదిపురుష్ సినిమా ఈవెంట్లు జరగనున్నాయి. 

నిజానికి ఆదిపురుష్ ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సాహో, రాధే శ్యామ్ వంటి వరుస ఫ్లాప్స్ తరువాత ప్రభాస్ నుండి వస్తోన్న సినిమా కావడం. అందులోనూ ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండటంతో.. ఆయన అభిమానులే కాదు సాధారణ  ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మూవీ అవుతుందని అనుకుంటున్నారు.  

మరోవైపు ఆదిపురుష్ ప్రచారం కోసం ప్రభాస్ రెడీ అవుతున్నాడు. చాలా కాలంగా బయట ఎక్కడా కనిపించని ఈ హీరో.. మరోసారి కెమెరాల ముందుకు రాబోతున్నాడు. ఆదిపురుష్ ప్రచారానికి మే నెలలో 10 రోజులు టైమ్ కేటాయించాడు ప్రభాస్.  రెండు భారీ ఈవెంట్లతో పాటు, మీడియా ఇంటరాక్షన్ లో కూడా ప్రభాస్ పాల్గొననున్నాడు.