వట్టే జానయ్య పిటిషన్లపై విచారణ వాయిదా

వట్టే జానయ్య పిటిషన్లపై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు :  సూర్యాపేట జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్‌ వట్టే జానయ్య దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.  రాష్ట్రంలోని గత ప్రభుత్వ హయంలో  రాష్ట్ర పోలీసులు  తనపై ఒకే సారి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ జానయ్య ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్ ను జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ దేవినా సెహ్‌గల్‌ వాదిస్తూ.. తాను కొత్తగా బాధ్యతలు చేపట్టినందున కౌంటరు దాఖలు చేయడానికి గడువు కావాలని బెంచ్ కు విన్నవించారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న బెంచ్.. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.