‘అడ్జస్ట్‌‌ సెన్సిటివిటీ కంటెంట్‌‌’.. ఇన్‌‌స్టాగ్రామ్‌‌ కొత్త అప్‌‌డేట్‌‌

‘అడ్జస్ట్‌‌ సెన్సిటివిటీ కంటెంట్‌‌’.. ఇన్‌‌స్టాగ్రామ్‌‌ కొత్త అప్‌‌డేట్‌‌

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో న్యూస్‌‌ ఫీడ్‌‌ చేస్తున్నప్పుడు అనవసరమైన కంటెంట్‌‌, రికమెండేషన్‌‌ పోస్ట్‌‌లు వస్తుంటాయి. వాటివల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాటిని బ్లాక్ చేయడానికి ‘అడ్జస్ట్‌‌ సెన్సిటివిటీ కంటెంట్‌‌’ అప్‌‌డేట్‌‌ని తీసుకొస్తోంది ఇన్‌‌స్టాగ్రామ్‌‌. 

పోస్ట్‌‌ పైన ఉండే మూడు చుక్కలను క్లిక్​ చేస్తే ‘వై యు ఆర్ సీయింగ్‌‌ దిస్‌‌ యాడ్‌‌’, ‘నాట్‌‌ ఇంట్రెస్టెడ్‌‌’, ‘రిపోర్ట్‌‌’ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిని సెలక్ట్‌‌ చేసి ఇన్‌‌స్టాగ్రామ్‌‌కి కంప్లైంట్‌‌ చేయొచ్చు. లేదంటే సెట్టింగ్స్‌‌లోకి వెళ్లి అకౌంట్‌‌ ఓపెన్‌‌ చేస్తే దాంట్లో ‘సెన్సిటివిటీ కంటెంట్‌‌ కంట్రోల్’ అని ఉంటుంది. దాన్ని డిజెబుల్‌‌ చేసుకుంటే కంటెంట్‌‌ బ్లాక్ అవుతుంది.