GT vs RCB: 6 నిమిషాల్లో హాఫ్ సెంచరీ.. క్రికెట్ చరిత్రలోనే జాక్స్ సంచలన రికార్డ్

GT vs RCB: 6 నిమిషాల్లో హాఫ్ సెంచరీ.. క్రికెట్ చరిత్రలోనే జాక్స్ సంచలన రికార్డ్

6 నిమిషాల్లో హాఫ్ సెంచరీ.. ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్ విల్ జాక్స్ ఊహకందని ఇన్నింగ్స్ తో శివాలెత్తాడు. సన్ రైజర్స్ పై జరిగిన మ్యాచ్ లో కేవలం 6 నిమిషాల్లో హాఫ్ చేసి ఔరా అనిపించాడు. మొదట 50 పరుగులను 31 బంతుల్లో చేసిన జాక్స్.. సెంచరీ మార్క్ అందుకోవడానికి కేవలం 10 బంతులే అవసరమయ్యాయి. సాయంత్రం 6:41 నిమిషాలకు హాఫ్ సెంచరీ చేసిన జాక్స్.. 6:47 నిమిషాలకు సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం.

ఇతని పవర్ హిట్టింగ్ ధాటికి ఇన్నింగ్స్ 15,16 ఓవర్లలో 29, 29 పరుగుల చొప్పున మొత్తం 58 పరుగులు వచ్చాయి. చివరి 10 బంతుల్లో 6, 2, 6, 4, డాట్,6, 6, 4, 6, 6  బాది ఈ సీజన్ రెండో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాటర్ నిలిచాడు. మరో ఎండ్ లో కోహ్లీ జాక్స్ హిట్టింగ్ కు ఫిదా అయిపోయాడు. బౌండరీలు బాదుతుంటే అలానే చూస్తుండిపోయాడు. ఒక ప్లేయర్ ఇంత తక్కువ టైంలో 50 పరుగులు చేయడం ఇదే తొలిసారి. దీంతో క్రికెట్ చరిత్రలో ఈ రికార్డ్ బ్రేక్ అవ్వడం అసాధ్యమని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. 

జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ తో.. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని  బెంగళూరుకు కేవలం 16 ఓవర్లలోనే చేధించింది. దీంతో టోర్నమెంట్ చరిత్రలో అత్యంత వేగంగా 200-ప్లస్ ఛేజింగ్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ క్రమంలో  జాక్స్ కూడా అతి తక్కువ బంతుల్లో ఇన్నింగ్స్‌లో రెండవ యాభై పరుగులు చేసిన క్రిస్ గేల్  ఆల్-టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. జాక్స్.. మొదటి 50 పరుగుల కోసం 31 బంతులు తీసుకోగా.. ఆ తర్వాత కేవలం 10 బంతుల్లో మరో 50 పరుగులు చేసి శతకాన్ని నమోదు చేశాడు.