ఇబ్రహీంపట్నం, వెలుగు: పిల్లలను చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి కొమ్మిశెట్టి సూచించారు. ‘చైల్డ్ వెల్ఫేర్ వీక్’ సందర్భంగా లీగల్ అడాప్షన్పై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన దత్తత సహాయ కేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు.
దత్తతపై అవగాహన లేక కొందరు తప్పుడు మార్గాలను అనుసరించి ఇబ్బందులు పడుతున్నారని. ప్రతి ఒక్కరూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ పోర్టల్ ద్వారానే దత్తత ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీలత, సీడబ్ల్యూసీ సభ్యురాలు రమాదేవి, డీసీపీఓ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

