అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి: తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి: తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: న్యాయవాదులకు రక్షణ కరువైందని, వెంటనే ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటక్షన్ యాక్ట్ అమలు చేయాలని తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో  తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో అడ్వకేట్లు న్యాయ దీక్ష చేపట్టారు. ఎంపీ ఆర్. కృష్ణయ్య, రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్, గుజ్జ కృష్ణ హాజరై మద్దతు తెలిపారు.  వారు మాట్లాడుతూ.. న్యాయవాదులకు వృత్తిపరంగా ఎందరి నుంచో ప్రాణహాని ఉంటుందన్నారు. 

వారికి రక్షణ కరువవుతోందన్నారు. కర్నాటక, రాజస్థాన్ మాదిరిగా తెలంగాణలోనూ వారి రక్షణ కోసం బలమైన చట్టం తీసుకురావాలన్నారు. జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ అద్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. జూనియర్ అడ్వకేట్లకు రూ.15 వేలు స్టైఫండ్ చెల్లించాలని, అర్హులైన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం నాయకులు తులసీరామ్, క్రిష్, శ్యాం, సూర్య, సురేశ్​కుమార్, మహేందర్, నరేశ్, నవీన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.