టీఎస్పీఎస్సీ ముందు ఉద్రిక్తత.. ఏఈఈ ఫలితాలు వెల్లడించాలని డిమాండ్

టీఎస్పీఎస్సీ ముందు ఉద్రిక్తత.. ఏఈఈ ఫలితాలు వెల్లడించాలని డిమాండ్

హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏఈఈ పరీక్ష నిరహించి నెలలు గడుస్తున్నా రిజల్ట్ ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఏఈఈ ఫలితాలను వెళ్లడించాలంటూ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు నిరసన చేపట్టారు. దీంతో ఏఈఈ అభ్యర్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 

టీఎస్పీఎస్సీ ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ అధికారులను కలిసేందుకు వస్తే అరెస్ట్ చేయడం ఎందుకని అభ్యర్థులు ప్రశ్నించారు. ఏఈఈ ఫలితాలపై స్పష్టమైన ప్రకటన వస్తేనే తాము ధర్నా విరమిస్తామన్నారు అభ్యర్థులు.