గాలిలో తుంపర్లు.. 10 మీటర్లు వ్యాప్తి

గాలిలో తుంపర్లు.. 10 మీటర్లు వ్యాప్తి

వైరస్ వ్యాప్తికి ఏరోసాల్స్, డ్రాప్లెట్స్  ప్రధాన కారణమని తెలిపింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీస్. ఏరోసాల్స్ కనీసం పది మీటర్ల దూరం వైరస్ ను మోసుకెళ్తాయని స్పష్టం చేసింది. డ్రాప్లెట్స్ 2 మీటర్ల దూరం వెళ్తాయని తెలిపింది. లక్షణాలు కనిపించని వ్యక్తి నుంచి కూడా డ్రాప్లెట్స్ ద్వారా ఇతరులకు కరోనా సోకుతుందని తెలిపింది. ప్రజలు తప్పకుండా డబుల్ లేయర్ మాస్కు ధరించాలని సూచించింది. ఇందులో భాగంగా మొదట సర్జికల్ మాస్కు పెట్టుకుని, దానిపై నుంచి టైట్ గా ఉన్న క్లాత్ మాస్కు పెట్టుకోవాలని చెప్పింది.  సర్జికల్ మాస్కు అందుబాటులో లేకపోతే రెండు కాటన్ మాస్కులు పెట్టుకోవాలని తెలిపింది. సాధారణంగా సర్జికల్ మాస్కులు ఒకసారే వాడతారని, కానీ డబుల్ మాస్కు విధానంలో ఐదు సార్లు వాడొచ్చని స్పష్టం చేసింది.