ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో అర్థరాత్రి హై డ్రామా. ఇండియా నుంచి వెళ్లి లండన్ సిటీలో స్థిరపడిన సిక్కులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సిక్కు మతానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయిని.. 34 ఏళ్ల ఓ ఆప్ఘనిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడంటూ గుంపులు గుంపులుగా తరలివచ్చిన సిక్కులు.. ఆందోళనకు దిగారు. ఆ ఇంటి దగ్గర ఆందోళనకు దిగటంతో హై టెన్షన్ నెలకొంది.
లండన్ సిటీలోని హౌన్స్ అనే ఏరియాలో ఉన్న ఓ ఫ్లాట్ లో పెళ్లి జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి బ్రిటీష్ సిక్కులు తరలివచ్చారు. ఆప్ఘనిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి.. ఇతర మతాలకు చెందిన అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని.. కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతుందని.. ఈ పెళ్లిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన వారు ఉండే ఇంట్లోకి చాలా మంది చిన్న వయస్సు అమ్మాయిలు వస్తున్నారని.. వాళ్లను బ్రెయిన్ వాష్ చేసి.. వాళ్ల మతంలోకి మార్చి.. లండన్ నుంచి ఇప్ఘనిస్తాన్ తరలిస్తున్నారంటూ ఆరోపించారు సిక్కులు.
Also Read ; కేరళలో ఇద్దరు యువ అథ్లెట్లు ఆత్మహత్య
రెండేళ్లుగా మా అమ్మాయి అతన్ని కలుస్తుందని.. చాలా సార్లు వద్దని చెప్పినా వినలేదని.. పోలీసులకు కంప్లయింట్ చేసినా చర్యలు తీసుకోలేదంటూ బాధిత అమ్మాయి తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. పోలీసుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు రాకపోవటంతో.. గురుద్వారాలో తన బాధను చెప్పుకున్నానని.. అప్పుడు వీళ్లందరూ వచ్చారని వివరించారు.
ఆప్ఘనిస్తాన్ దేశస్తులు ఉంటున్న ఇంట్లో చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని.. డ్రగ్స్ కూడా ఉపయోగిస్తున్నారనే అనుమానంతో గతంలోనే పోలీసులకు కంప్లయింట్ చేసినా.. వాళ్లు పట్టించుకోలేదంటున్నారు ఇరుగుపొరుగు వారు.
16 ఏళ్ల సిక్కు అమ్మాయి.. ఆప్ఘన్ల ఫ్లాట్ లో ఉన్నప్పుడే సిక్కులు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలిరావటంతో పోలీసులు రంగంలోకి దిగారు. చట్టప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ ఇంటి నలుగురు, ఐదుగురు ఆప్ఘనిస్తాన్ యువకులు ఉన్నారని.. ఆ ఇల్లు కూడా స్కూల్ సమీపంలోనే ఉందని.. చిన్న వయస్సు అమ్మాయిలను డ్రాప్ చేసి.. మతం మార్చి.. ఆప్ఘనిస్తాన్ తరలిస్తున్నారంటూ స్థానికులు సైతం పోలీసులకు చెప్పటంతో.. ఈ అంశంపై విచారణ చేస్తున్నారు లండన్ పోలీసులు.
