ఏం జరుగుతుందో చూద్దాం: ‘బోర్డర్‌ 2’ రిలీజ్‌కు ముందు అఫ్గాన్‌ క్రికెటర్‌ రీల్.. బాలీవుడ్ హీరోల రిప్లైస్ వైరల్!

ఏం జరుగుతుందో చూద్దాం:  ‘బోర్డర్‌ 2’ రిలీజ్‌కు ముందు అఫ్గాన్‌ క్రికెటర్‌ రీల్.. బాలీవుడ్ హీరోల రిప్లైస్ వైరల్!

బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ‘గదర్ 2’ సక్సెస్ జోష్లో ఉన్న సన్నీ డియోల్, మరోసారి తన ఫ్యాన్స్ను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ స్టార్ హీరో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘బోర్డర్ 2’. ఈ మూవీ శుక్రవారం 2026 జనవరి 23న, భారత గణతంత్ర దినోత్సవానికి ముందుగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొల్పాయి. సరిహద్దులో భారత సైనికుల ధైర్యసాహసాలు, దేశభక్తిని హృదయాన్ని తాకేలా చూపించిన 1997 నాటి బ్లాక్‌బస్టర్ ‘బోర్డర్’ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాపై అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రేపు విడుదల కానున్న బోర్డర్ 2పై తన ఉత్సాహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.

ALSO READ : నమ్రత పుట్టినరోజున మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..

ప్రస్తుతం దుబాయ్‌లో అఫ్గానిస్థాన్–వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో పాల్గొంటున్న రషీద్ ఖాన్, హైవే పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తూ ఒక సరదా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బోర్డర్ 2 పాట వినిపించగా, “ఈ సినిమా కోసం నేను ఎదురుచూస్తున్నా.. ఇప్పుడు ఈ రీల్ పోస్ట్ చేస్తున్నా కదా.. చూద్దాం ఏమవుతుందో!”  అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashid Khan (@rashid.khan19)

ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సరదా వీడియో క్రికెట్ అభిమానులతో పాటు బాలీవుడ్ నటులను కూడా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే బోర్డర్ 2లో కీలక పాత్ర పోషిస్తున్న వరుణ్ ధావన్ కామెంట్ చేస్తూ “హా భాయ్” అని స్పందించాడు. మరో నటుడు అహాన్ శెట్టి — “Lots of love bhai” అంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఇక ఒరిజినల్ బోర్డర్ సినిమాలో నటించిన సునీల్ శెట్టి, ‘అదే మార్గం’ (Ye hui na baa) ఆ హైవే నుంచే సినిమాకు రావాలి అనే అర్థం వచ్చేలా కామెంట్ పెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ALSO READ : ప్రపంచాన్ని కట్టిపడేస్తున్న తస్కరీ వెబ్ సిరీస్

ఈ సోషల్ మీడియా సంభాషణతో బోర్డర్ 2పై అంచనాలు మరింత పెరిగాయి. మొత్తానికి, క్రికెట్ మరియు సినిమా అభిమానులను కలిపేస్తూ బోర్డర్ 2 సోషల్ మీడియాలో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది.  ఇదిలా ఉండగా, దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో అఫ్గానిస్థాన్ జట్టు ఇప్పటికే వెస్టిండీస్‌పై రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఇవాళ మూడో మ్యాచ్‌లో తలపడనున్నాయి.