Asia Cup 2025: 5 బంతులకు 5 సిక్సర్లతో నబీ తుఫాన్ ఇన్నింగ్స్.. లంక ముందు బిగ్ టార్గెట్

Asia Cup 2025: 5 బంతులకు 5 సిక్సర్లతో నబీ తుఫాన్ ఇన్నింగ్స్.. లంక ముందు బిగ్ టార్గెట్

ఆసియా కప్ 2025 సూపర్-4 బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ లో అదరగొట్టింది.   గురువారం (సెప్టెంబర్ 18) అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. ఒక దశలో స్వల్ప స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించినా నబీ (22 బంతుల్లో 60: 6 సిక్సర్లు,3 ఫోర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ కు ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. సీనియర్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ 60 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార నాలుగు వికెట్లు పడగొట్టాడు. చమీర, వెళ్లలాగే, శనకలకు ఒక్కో వికెట్ దక్కింది. 

ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తమ నిర్ణయానికి తగ్గట్టే ఆఫ్ఘనిస్తాన్ కు ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి రెండు ఓవర్లలోనే 26 పరుగులు రాబట్టి శరవేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. మూడో ఓవర్లో లంక పేసర్ తుషార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో గర్భాజ్ (14), కరీం జనత్ (1)లను పెవిలియన్ కు చేర్చాడు. ఇదే ఊపులో తుషార మంచి టచ్ లో కనిపించిన తుషారను ఔట్ చేసి ఆఫ్ఘనిస్థాన్ ను కష్టాల్లో పడేశాడు. 

పవర్ ప్లే లో 45 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చాల స్లో గా సాగింది. ఇబ్రహీం జద్రాన్, రసూలీ స్లో గా ఆడడంతో తొలి 10 ఓవర్లలో 63 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజ్ లో ఉన్నంత సేపు పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన రసూలీ 16 బంతుల్లో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మిడిల్ ఓవర్స్ లో ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. తొలి 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసి లో తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే ఆల్ రౌండర్ నబీ ఈ దశలో అద్భుతమే చేశాడు. 

ALSO READ : రాహుల్ బాటలోనే జహీర్..! లక్నో సూపర్ జెయింట్స్‎కు జహీర్ ఖాన్ గుడ్ బై

చివరి రెండు ఓవర్లలో ఏకంగా 49 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది. నబీ 22 బంతుల్లోనే 6 సిక్సర్లు.. మూడు ఫోర్లతో 60 పరుగులు చేశాడు. తొలి 10 ఓవర్లలో 63 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్ చివర్ల 10 ఓవర్లలో 106 పరుగులు రాబట్టింది.