రాహుల్ బాటలోనే జహీర్..! లక్నో సూపర్ జెయింట్స్‎కు జహీర్ ఖాన్ గుడ్ బై

రాహుల్ బాటలోనే జహీర్..! లక్నో సూపర్ జెయింట్స్‎కు జహీర్ ఖాన్ గుడ్ బై

లక్నో సూపర్ జెయింట్స్‎కు టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్ గుడ్ బై చెప్పాడు. గత ఏడాది లక్నో మెంటర్‎గా బాధ్యతలు చేపట్టిన జహీర్ వచ్చే సీజన్‎ (2026)కు ముందు ఆ జట్టుకు వీడ్కోలు పలికాడు. లక్నో ఫ్రాంచైజ్ యాజమాని సంజీవ్ గోయెంకా తీరు నచ్చక గతంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఆ జట్టును వీడిన విషయం తెలిసిందే. తాజాగా జహీర్ ఖాన్ కూడా అదే రీజన్‎తో లక్నోకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. సంజీవ్ గోయెంకా, లక్నో హెడ్ కోచ్ జస్టిస్ లాంగర్ తీరు నచ్చకే జహీర్ ఆ జట్టు నుంచి వైదొలిగినట్లు సమాచారం. 

జహీర్ ఖాన్ గతేడాది లక్నో మెంటర్‎గా బాధ్యతలు చేపట్టాడు. వేలంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‎ను ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ ధరకు (27 కోట్లు) కొనుగోలు లక్నో కొనుగోలు చేయడంలో జహీర్ కీలకంగా వ్యవహరించాడు. కానీ జహీర్ వ్యూహాలు ఫలించలేదు. గత సీజన్‎లో లక్నో కెప్టెన్‎గా, ఆటగాడిగా రిషబ్ పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. కానీ జహీర్ అమలు చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌, దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్‌ ఓపెనింగ్‌ ప్లాన్ వర్కౌట్ అయ్యింది.

ఇదే సమయంలో లక్నో బౌలింగ్ దళం పూర్తిగా తెలిపోవడంతో ఆ జట్టు 14 మ్యాచుల్లో కేవలం ఆరు విజయాలకే పరిమితమై ఏడో స్థానంలో నిలిచింది. 2022లో ఐపీఎల్‎కు ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫస్ట్ రెండు సీజన్లు ప్లే ఆఫ్స్‎కు చేరుకుంది. కానీ జహీర్‎ను మెంటర్‎గా తీసుకున్న సీజన్‎లో ఆ జట్టు పూర్ ఫెర్మాఫెన్స్ చేసింది. 7వ స్థానంలో నిలిచి కనీసం ప్లే ఆఫ్స్‎కు చేరుకోలేకపోయింది.

దీంతో జహీర్‎ పని తీరుపై లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. అదే సమయంలో గోయెంకా, లక్నో కోచ్ లాంగర్ తీరుపై కూడా జహీర్ కు నచ్చలేదని సమాచారం. ఈ కారణంతోనే లక్నో జట్టుకు జహీర్ వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. లక్నో గుడ్ చై చెప్పిన జహీర్.. వచ్చే ఏడాది ఏ జట్టుతో జత కడతారో చూడాలి.