24 ఏళ్ల తర్వాత శీతాకాలంలో రంజాన్..

24 ఏళ్ల తర్వాత శీతాకాలంలో రంజాన్..

రంజాన్.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకునే పండగ. రంజాన్ నెల ప్రారంభం కోసం ముస్లీంలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈసారి రంజాన్ ను ముస్లింలు.. 24 ఏళ్ల తర్వాత వింటర్ సీజన్ లో జరుపుకోనున్నారు. శీతాకాలం.. డిసెంబర్ 21న ప్రారంభమై మార్చి 20తో ముగుస్తుంది. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం..  సౌదీ అరేబియాలో రంజాన్ నెల మార్చి 10న ప్రారంభం కానుండగా.. భారత్ లో మాత్రం మార్చి 11న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

షవ్వాల్ నెలవంకను బట్టి రంజాన్ నెల వ్యవధి 29 లేదా 30 రోజులు ఉండవచ్చు. చంద్రుని వీక్షించే సంప్రదాయం ఆధారంగా రంజాన్ ప్రారంభానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీని నిర్ధారిస్తారు.

ఇస్లామిక్ క్యాలెండర్‌లో రంజాన్ అత్యంత పవిత్రమైన నె. ముహమ్మద్ ప్రవక్తకు ఖురాన్ అవతరించిన నెలగా రంజాన్ ను భావించి ముస్లింలు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నెల ప్రారంభం నుచి ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాస సమయంలో ఆహారంతోపాటు పానీయాలను కూడా తీసుకోకుండా పవిత్రంగా ఉంటారు.