బీజేపీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ అరెస్ట్

బీజేపీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ అరెస్ట్

ఎల్బీనగర్/నిర్మల్, వెలుగు: ఆదివారం బీ‌‌జేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేస్తుండగా జరిగిన ఘర్షణలో రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి కాలు విరిగింది. సంజయ్ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసుల దౌర్జన్యం చేశారని.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు కాలిబూట్లతో తొక్కి దారుణంగా ప్రవర్తించారని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మహిళా మోర్చా ప్రెసిడెంట్ కృష్ణవేణి మండిపడ్డారు. సోమవారం నాగోల్ బండ్లగూడలోని ఇంటికి వెళ్లి పద్మారెడ్డిని పరామర్శించారు.

బీజేపీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ అరెస్ట్

బీజేపీ సోషల్ మీడియా విభాగం స్టేట్ కన్వీనర్ సతీశ్​​ చంద్రను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై పోలీసులు సతీష్ చంద్రను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ లో ఉ౦డే తల్లి వద్దకు వచ్చిన ఆయనను నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్​కు తరలించారు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్న సతీశ్​ చంద్రను అరెస్టు చేయడం అక్రమమంటూ బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.