పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శుక్రవారం ఆగస్టు 09, 2024న లోక్ సభనిరవధిక వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. మరోవైపు రాజ్యసభ కూడా నిరవధిక వాయిదా పడింది. ఈ పార్లమెంట్ సెషన్ లో బడ్జెట్2024 ను ఆమోదించారు. వక్ఫ్ చట్టాన్ని సవరించే బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అయితే దాని నిబంధనలపై నిరసన లు రావడంతో పార్లమెంట్ సంయుక్త కమిటీకి సిఫార్లు చేయబడింది.
సభ ఉత్పాదకత130 శాతానికి పైగా ఉందని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. దీంతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణాలర్పించిన యోధులకు ఉభయ సభల్లో సంతాపం ప్రకటించారు. నివాళిగా మౌనం పాటించారు. ఈ సారి వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కు ఒకరోజు ముందుగానే ముగిశాయి.
పార్లమెంట్ సమావేశాల అనంతరం ఓ ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇచచిన టీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, పలువురు నేతలు హాజరయ్యారు. టీ మీటింగ్‌లో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అధికార, ప్రతిపక్ష నేతల సమావేశానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుంది..
అధికార ప్రతిపక్ష నేతలు పాల్గొన్న సమావేశానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు. రాహుల్, మోదీల బాడీ లాంగ్వేజ్ లను వివరిస్తూ మీమ్స్ పెడుతున్నారు. రాహుల్ వైఖరికి మోదీ అసౌకర్యంగా ఫీలవుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది రాహుల్ గాంధీని మోదీ క్రమక్రమంగా గుర్తిస్తున్నాడు అంటూ రాశారు.