గల్ఫ్ ఉద్యోగాళ్లంటూ మోసం : రోడ్డున పడ్డ 20 కుటుంబాలు

గల్ఫ్ ఉద్యోగాళ్లంటూ మోసం : రోడ్డున పడ్డ 20 కుటుంబాలు

జగిత్యాల : గల్ఫ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుపేదలను మోసం చేశాడు ఓ ఏజెంట్. దీంతో 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన 22 మందికి దుబాయ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని అక్కడి సప్లై కంపెనీకి పంపించాడు ఓ ఏజెంట్. పంపించేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.70 వేలు తీసుకున్నాడు. ప్రతీఒక్కరికీ నెలకు రూ.20వేల జీతం వస్తుందని చెప్పాడు.

ఏజెంట్ మాటలు నమ్మి .. దుబాయ్ కు వెళ్లిన తమ వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. అక్కడికి వెళ్లాక ఒక్క నెల కూడా జీతం ఇవ్వకుండా.. తినడానికి తిండి కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఎలాగైనా వాళ్లను వెనక్కి రప్పించాలని కుటుంబ సభ్యులు ఏడుస్తూ కోరారు. దుబాయ్ కి వెళ్లి నాలుగు నెలలైనట్లు తెలిపారు.