
మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ఏది నిజం.. ఏది అబద్ధం.. ఏది నిత్యం.. ఏది సమస్తం అనేది తెలియక.. సోషల్ మీడియా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్న నేటి తరానికి సాయిబాబా బోధనల సారాన్ని పరిచయం చేసేందుకు ప్రముఖ రంగస్థల నిర్మాణ సంస్థ AGP World సిద్ధమైంది. అందులో భాగంగా ముంబైలో అక్టోబర్ 15, 16 తేదీలలో సాయి - ద మ్యూజికల్ అనే ప్రదర్శన చేపడుతోంది. ముంబై నగరంలోనే మొట్టమొదటి సారి సంగీతం, భక్తి మేళవింపులో జంషెడ్ బాబా థియేటర్ లో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 2025, అక్టోబర్ 15వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు, 16వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు.. రెండు గంటల చొప్పున సాయి ద మ్యూజికల్ అనే ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది రంగస్థల నిర్మాణ సంస్థ AGP World.
సాయిబాబా జీవితంలో జరిగిన అంశాలను.. ఆయన బోధనలు సమకాలీన ప్రపంచానికి అనుసంధానిస్తూ ప్రదర్శించనున్నారు . అందుకోసం మొత్తం 15 మ్యూజికల్ ట్రాక్స్ సిద్ధం చేశారు. అదే విధంగా ఆయన బోధనలలోని ముఖ్యాంశాలైన శ్రద్ధ (విశ్వాసం), సబూరి (సహనం) ద్వారా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు, సవాళ్లకు పరిష్కారం చూపే విధంగా ప్రదర్శన ద్వారా తెలియజేస్తారు.
ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ ఆలపించిన ప్రత్యేక గీతాలతో సాగే ఈ షో లో 30 మంది తారాగణం, 300 కు పైగా కాస్ట్యూమ్స్ తో అత్యద్భుత ప్రదర్శనగా నిర్వహించనున్నారు. సాయిబాబా జీవితంలోని అంశాలను డ్రామా ప్లస్ మ్యూజికల్ మిక్సింగ్ లో ప్రదర్శన సాగుతుంది. ఆయన జీవితం, మహిమలతో కూడిన అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే ఈ ప్రదర్శనపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి.
ALSO READ : ఆయుధపూజ ఎందుకు చేయాలి.. చదవాల్సిన మంత్రం ఇదే..!
25 సంవత్సరాలకు పైగా ప్రపంచ స్థాయి థియేటర్, పర్యాయపదంగా ఉన్న AGP వరల్డ్ వెనుక ఉన్న పవర్‌హౌస్ నిర్మాత అశ్విన్ గిద్వానీ. 'సాయి - ది మ్యూజికల్' తన హృదయానికి ఎందుకు దగ్గరగా ఉందో చెప్పారు. 'దేవదాస్ - ది మ్యూజికల్' వంటి నిర్మాణాలతో పేరు తెచ్చుకున్న గిద్వానీ.. 22 నగరాలు , 12 దేశాలలో ఇండియన్ థియేటర్‌ను పునర్ నిర్వచించేందుకు కంకణం కట్టుకున్నారు. థియేటర్‌లో మాయాజాలం ఉంది... ఇది వ్యక్తులను కదిలిస్తుంది, వ్యక్తిగతంగా మాత్రమే కాదు, ఒక గదిలో పంచుకున్న హృదయ స్పందనగా ఆయన పేర్కొన్నారు. సాయి - ది మ్యూజికల్ తో, రెండు గంటల పాటు ప్రజలు తమ చింతలను వదిలి మానవత్వంతో తిరిగి కనెక్ట్ అయ్యే స్థలాన్ని సృష్టించాలనుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
గిద్వానీ విజన్ ను ప్రముఖ నాటక రచయిత, దర్శకుడు అతుల్ సత్య కౌశిక్ కళారూపంలోకి తీసుకువచ్చారు. 'ద్రౌపది', 'చక్రవ్యూహ్', 'లెజెండ్ ఆఫ్ రామ్', 'వో లాహోర్' వంటి భారీ స్థాయి చారిత్రక , పౌరాణిక నిర్మాణాలు చేసిన ఆయన దీనికి డైరెక్షన్ చేయడం విశేషం.
రెండు రోజులు రెండు గంటల పాటు సాగే ఈ ప్రదర్శనలో సంగీతంతో పాటు సాయిబాబా బోధనలు ఉంటాయి. సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ షో మొదటి సారి నిర్వహించటం గర్వంగా ఉందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ షోలో పాల్గొనే ఔత్సాహికులు, ఆసక్తి ఉన్న వారు BookmyShowలో టికెట్ బుక్ చేసుకుని హాజరుకావొచ్చు. ముంబై వెళ్లి హాజరుకాలేని వారు ఆన్ లైన్ ద్వారా వీక్షించొచ్చు అని ప్రకటించింది ప్రముఖ రంగస్థల నిర్మాణ సంస్థ AGP World. అక్టోబర్ 15వ తేదీ సాయిబాబా దివ్య సమాధి అయిన రోజు అని.. అలాంటి రోజున.. ముంబై సిటీలోని నారిమన్ పాయింట్ లోని NCPA దగ్గరలోని జంషెడ్ బాబా ధియేటర్ లో ఈ షో నిర్వహించనున్నట్లు ప్రకటించిన AGP World.. సాయిబాబా భక్తులే కాదు.. ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది.