పిచ్చి పీక్స్: రైల్వే ట్రాక్ పై తల్లి డాన్సులు.. కూతురు షూట్

పిచ్చి పీక్స్: రైల్వే ట్రాక్ పై తల్లి డాన్సులు.. కూతురు షూట్

సోషల్ మీడియా మోజులో పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఓవర్ నైట్ స్టార్ అయిపోవన్న కోరికతో.. కొంత మంది యువతీ యువకులు తోటి వారికి ఇబ్బంది కలిగిస్తున్నామా! అన్న విచక్షణ మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పతున్న వారు కొందరైతే.. నిషేధ ప్రదేశాల్లో డ్యాన్సులు వేస్తూ జైలు పాలవుతున్న వారు మరికొందరు.

ఈ విషయంలో మనం ఈ కథనంలో మాట్లాడుకోబోయే తల్లీ కూతళ్లది మరో లెవెల్. తల్లి డ్యాన్స్ వేస్తుండగా.. కూతురు షూట్ చేసింది. చేస్తే చేశారు గానీ.. అది ఏ గట్టు వెంబడో.. చెరువు వెంబడో చేస్తే సరిపోయేది. అలా చేస్తే సమాజం గుర్తించదు అనుకున్నారేమో రైల్వే ట్రాక్ పై మొదలుపెట్టారు. తల్లి 'అబ్ తేరే బిన్ హమ్ భీ జీ లేంగే' పాటకు స్టెప్పులు వేయగా.. కూతురు చాలా జాగ్రత్తగా ఆ దృశ్యాలను రికార్డు చేసింది.

చివరకు పోలీసుల చేతికి చిక్కి

ఈ వీడియో నెట్టింట వైరలవడం.. నెటిజన్స్ వీరిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పోలీసులు వారిని వెతికి మరీ పట్టుకున్నారు. సదరు మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.. రైల్వే చట్టం 145, 147 కింద కేసు నమోదు చేశారు. రీల్ షూటింగ్‌లో సహకరించిన ఆమె కుమార్తెను కూడా పోలీసులు ఈ విషయంలో అరెస్ట్ చేశారు. అయితే, వీరిద్దరూ మరోసారి ఇలాంటివి పునరావృతం చేయమని హామీ ఇవ్వడంతో వారిని బెయిల్ పై విడుదల చేశారు. ఈ ఘటన ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

దేశంలో రైల్వే ప్రాంగణాల్లో షూటింగ్ చేయాలంటే సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. అయితే రైలు పట్టాలు, రైలు పైకప్పులు వంటి ప్రాణాంతక ప్రదేశాలలో చిత్రీకరణ పూర్తిగా నిషేధం.