పోలీస్ సిబ్బందికి ప్రమాద బీమా

పోలీస్ సిబ్బందికి ప్రమాద బీమా
  • బ్యాంక్ ఆఫ్ బరోడాతో  పోలీసు శాఖ ఒప్పందం 

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ పోలీసులకు ‘బరోడా పోలీస్ శాలరీ ప్యాకేజ్’అందించడానికి రాష్ట్ర పోలీస్ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ జోనల్ హెడ్ నితీశ్‌‌ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ (పీఏఐ)ను అందించనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 

ఈ ప్రత్యేక ఆఫర్‌‌‌‌ కింద డెబిట్, క్రెడిట్ కార్డు సేవలతో పాటు ఎన్నో ప్రయోజనాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.05 కోట్లు, డ్యూటీ సమయంలో మరణిస్తే రూ.90 లక్షలు, శాశ్వత వైకల్యానికి రూ.60 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.30 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుందన్నారు. 

డీజీపీ అంజనీకుమార్‌‌ ఆమోదం తెలిపిన తర్వాత, తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ఏడీజీపీ అభిలాష బిస్త్, బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున జనరల్ మేనేజర్ జోనల్ హెడ్ నితీశ్ కుమార్ మధ్య ఒప్పందం కుదిరింది.