హైదరాబాద్, వెలుగు: టాటా గ్రూప్‌నకు చెందిన లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ జోయా 'హర్ ఎగైన్' పేరుతో హై జ్యువెలరీ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. సుగంధ ద్రవ్యాల రంగులు, జ్ఞాపకాల స్ఫూర్తితో ఈ ఆభరణాలను డిజైన్ చేశామని కంపెనీ తెలిపింది.
పసుపు, కుంకుమపువ్వు, యాలకులు, గులాబీ రంగుల శోభను ప్రతిబింబించేలా విలువైన రత్నాలతో వీటిని రూపొందించారు. ఈ కలెక్షన్లో నెక్లెస్‌లు, చెవి పోగులు, గాజులు, బ్రాస్లెట్స్వంటివి ఉంటాయి. సితార్ విద్వాంసురాలు అనుష్కా శంకర్ జోయాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
