విద్యుత్ కోతలపై రైతుల ధర్నా..కోనరావుపేట మండలం ధర్మారంలో కాలిపోయిన మోటర్లతో నిరసన 

విద్యుత్ కోతలపై రైతుల ధర్నా..కోనరావుపేట మండలం ధర్మారంలో కాలిపోయిన మోటర్లతో నిరసన 

కోనరావుపేట, వెలుగు : కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలతో పంటలు ఎండిపోతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటల పాటు కాలిపోయిన మోటర్లతో బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవసాయానికి సరైన సమయంలో కరెంట్ సరఫరా చేయడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని, లో వోల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనిడిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన  విరమించారు.