న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) డిటర్జెంట్ల ధరలను పెంచింది. ముడిసరుకుల ఖర్చులు పెరగడంతో అక్టోబర్‌లో వీల్, సర్ఫ్ ఎక్సెల్, రిన్ బ్రాండ్ల వివిధ ప్యాకెట్లపై ధరలు పెంచింది. సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ కేజీ ప్యాక్ రూ.167 నుంచి రూ.172కి (3శాతం పెంపు), 500 గ్రాముల ప్యాక్ రూ.85 నుంచి రూ.87కి పెరిగింది.
250 గ్రాముల సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.42 నుంచి రూ.45కి చేరింది. రిన్ పౌడర్ కేజీ ప్యాకెట్ ధర రూ.120 నుంచి రూ.123కి పెరగ్గా, రిన్ అలా (500 మి.లీ) ధర రూ.90 నుంచి రూ.95కి పెరిగింది. వీల్ పౌడర్ కేజీ ప్యాక్ ధర రూ.90 నుంచి రూ.93కి చేరింది.
