రైతుల నాశనం కోసమే అగ్రి చట్టాలు 

రైతుల నాశనం కోసమే అగ్రి చట్టాలు 

రైతుల అభివృద్ధిని అడ్డుకునేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్రి  చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర నిరసన కార్యక్రమంలో పాల్గొని తనను కలిసిన ఎంపీలతో  రాహుల్ మాట్లాడారు.  ప్రధాని మోడీ రైతులను గౌరవించరన్నారు.  రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

జనవరి 15న ‘కిసాన్‌ అధికార్‌ దివస్‌’గా పాటించాలని కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ రాజ్‌ భవన్‌ల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.