గండిపేట, వెలుగు: మూడ్రోజులు సిటీలో పడుతున్న భారీ వానల కారణంగా రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా కోర్సుల అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ను వాయిదా వేశామని అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జులై 21, 22 తేదీల్లో నిర్వహించే ఈ కౌన్సిలింగ్‌ను వాయిదా వేశామన్నారు. అభ్యర్థులంతా ఈ విషయాన్ని గమనించాలన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.

