బ్రిటన్: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం (జూన్ 14) ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. బర్మింగ్‌హోమ్‌లోని ఎడ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ హైఓల్టేజ్ పోరులో టాస్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్స్ కరచాలనం చేసుకోవడం ఆనవాయితీ. కానీ ఈ మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ఇండియా కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. టాస్ అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పురుషుల జట్టు ప్రారంభించిన ఈ నో షేక్ హ్యాండ్ విధానాన్ని భారత మహిళల క్రికెట్ జట్టు కూడా కొనసాగిస్తోంది.
అసలేం ఏం జరిగిందంటే..?
2025, ఏప్రిల్‌లో కశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో అమాయక భారత పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి నిరసనగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం టెర్రర్ అటాక్‌లో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలకు గౌరవంగా.. వారి కుటుంబాలకు మద్దతుగా నిలవడానికి టీమిండియా ‘నో షేక్ హ్యాండ్’ విధానాన్ని పాటిస్తోంది.
►ALSO READ | పాక్‌పై టాస్ గెలిచిన భారత్.. భారీ స్కోర్‌పై కన్నేసిన హర్మన్‌ప్రీత్
ఇందులో భాగంగానే ఈ దాడి అనంతరం జరిగిన ఏ టోర్నీలోనూ టాస్ సమయంలో గానీ, మ్యాచ్ ముగిసిన తర్వాత కానీ ఇరుదేశాల ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. ఆసియా కప్, మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లతో ఇండియా ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పురుషుల జట్టు ప్రారంభించిన ఈ నో షేక్ హ్యాండ్ విధానాన్ని భారత మహిళల క్రికెట్ జట్టు కూడా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం (జూన్ 14) పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా అమ్మాయిలు నో షేక్ హ్యాండ్ విధానాన్ని పాటించారు.
