ఏపీలోని ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఏపీలోని ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • అమిత్​షాకు తుమ్మల లేఖ

భద్రాచలం, వెలుగు: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షాకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం లేఖ రాశారు. రెండు రాష్ట్రాల సీఎంలు కూడా చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు. 

ఏపీలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో లేఖ రాయడం విశేషం. ఏపీ రాష్ట్ర పునర్విభజన కారణంగా భద్రాచలం డివిజన్​లో జరిగిన నష్టాన్ని లేఖలో ప్రస్తావించారు. భద్రాచలంను ఆనుకుని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెం పంచాయతీలను తెలంగాణలో కలపడంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.