పురుగుల మందులు వాడకం తగ్గించాలి : తుమ్మల నాగేశ్వరరావు

పురుగుల మందులు వాడకం తగ్గించాలి : తుమ్మల నాగేశ్వరరావు

శామీర్​పేట వెలుగు :  వ్యవసాయ రంగంలో నెలకొన్న ప్రధాన సమస్య.. పురుగుల మందులు అధికంగా వాడటమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పెస్టిసైడ్స్​వాడకంతోనే మన పంటలకు విదేశాల్లో డిమాండ్ ఉండడం లేదన్నారు. శామీర్​పేట మండలం తుర్కపల్లి జీనోమ్​వ్యాలీ పరిధిలో ఏటీజీసీ బయోటెక్ అగ్రి ఇన్నోవేషన్ బ్లాక్–సి నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు పురుగుల మందులు వాడకం లేని పంటలను, వ్యవస్థను సృష్టించాలని కోరారు. వీలైనంత త్వరగా పురుగుల మందుల వాడకాన్ని తగ్గించాలన్నారు. అన్ని దేశాలకూ పంటలను అందించే స్థితికి తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. కరోనా టైంలో అన్ని వ్యవస్థలు ఆగిపోయినా రైతుల పని మాత్రం ఆగలేదన్నారు. మన జాతి ఔన్నత్యానికి నిదర్శనం వ్యవసాయమేనని తెలిపారు. ఏటీజీసీ బయోటెక్ గైడెడ్ టూర్ సౌకర్యాలు, రీసెర్చ్ ల్యాబ్ లు, ప్రొడక్షన్ యూనిట్లను, ఇన్నోవేషన్ సెంటర్లను మంత్రి సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఏటీజీసీ సీఈఓ డా.విజయ భాస్కర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ మార్కండేయ గోరింటల్, శివరాం ప్రసాద్, రామ్ చందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.