సెప్టెంబర్ లో రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభం

సెప్టెంబర్ లో రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభం

రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి సెప్టెంబర్ లో యూరియా ఉత్పత్తి మొదలవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కొరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డిలు ఆదివారం సందర్శించారు. త్వరలోనే మళ్లీ పున:ప్రారంభం కాబోతున్న కర్మాగారం పనుల పురోగతి పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ అభివృద్ధిలో (రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) ఆర్ఎఫ్ సీఎల్
కీలక పాత్ర పోషించనున్నదని మంత్రి నిరంజన్ అన్నారు. ‘రామగుండం ఎరువుల కర్మాగారం రూ.6,120 కోట్లతో తిరిగి పున:ప్రారంభం కాబోతుంది. ఈ ఆర్ఎఫ్ సీఎల్ ద్వారా ప్రతి ఏటా 12.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయవచ్చు. రామగుండం ఎరువుల కర్మాగారంలో సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి దశ అమలులోకి వస్తుంది. రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసేలా వ్యవసాయ రంగంలో మార్పులు తెస్తున్నాం. తెలంగాణలో ఉన్న యూరియా కొరతను అధిగమించడానికి రామగుండం ఎరువుల కర్మాగారం సిద్ధం అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో పనులను వేగవంతంగా పూర్తి చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాం’ అని ఆయన అన్నారు.

For More News..

బైకులపై వచ్చి 20 మంది సైనికులు, 40 మంది పౌరులను చంపిన ఉగ్రవాదులు

మూడు నెలల ఫీజు మాఫీ చేసిన ప్రైవేట్ స్కూల్

అమెరికాలో ఎతైన హనుమాన్ విగ్రహం