'అన్‌స్టాప‌బుల్‌ 2' టైటిల్ సాంగ్ రిలీజ్

'అన్‌స్టాప‌బుల్‌ 2' టైటిల్ సాంగ్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ పేరు తెలియని వారుండరు. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్న ప్రజల కథానాయకుడు బాలకృష్ణ, ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు బాలయ్య. ఒక నటుడిగా, ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా ఎంతో మందిని అలరించిన బాలయ్య బాబు.. ఆహ వారి అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే షో ద్వారా హోస్ట్ గా మనందరి మదిని కొల్లగొట్టాడు ఈ నటసింహం. ఇప్పుడు "అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే" సీజన్ 2 ద్వారా మరోసారి అభిమానులను ఊర్రూతలూగించనున్నారు. అయితే సరికొత్తగా షోలను లాంచ్ చేసే ఆహ.. అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2 కోసం తాజాగా టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది.  

ఈ పాట గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, "రోల్ రైడ, మహతి స్వర సాగర్ సమకూర్చిన ఈ పాట నాకు ఎంతో బాగా నచ్చింది. ఆహ అభిమానుల అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.