హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, గేమింగ్, సినిమాటిక్ కంటెంట్ తయారీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ప్రకటించింది.
గేమ్ డిజైన్, 3డీ క్యారెక్టర్ల సృష్టి, యానిమేషన్, వాయిస్ జనరేషన్ వంటి విభాగాల్లో ఏఐని అనుసంధానించడం ద్వారా వేగవంతమైన, మెరుగైన గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తామని తెలిపింది. గేమింగ్‌తో పాటు ఏఐ ఆధారిత వీడియో మేకింగ్, డబ్బింగ్, పోస్ట్-ప్రొడక్షన్‌పై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది.
