న్యూఢిల్లీ: ఏఐతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ 0.8 శాతం వృద్ధి చెందే అవకాశముందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎండీ క్రిస్టలినా జార్జీవా అభిప్రాయపడ్డారు. జాబ్ మార్కెట్‌పై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమవుతాయని, ధనిక దేశాల్లో ఈ నెంబర్ 60 శాతం వరకు చేరొచ్చని అన్నారు. ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో మాట్లాడిన ఆమె, 2027 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే సత్తా ఇండియాకు ఉందన్నారు.
స్టార్టప్ సీఈఓలతో ప్రధాని భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏఐ, డీప్‌టెక్ స్టార్టప్ సీఈఓలతో సమావేశమ య్యారు. వ్యవసాయం, పర్యావరణం, సొంత భాషలో ఉన్నత విద్య వంటి రంగాల్లో ఏఐ వాడకంపై చర్చించారు. 16 స్టార్టప్‌ల ప్రతినిధులు తమ ఆవిష్కరణలను ప్రధానికి వివరించారు. డేటా గవర్నెన్స్ బలోపేతం చేయాలని, తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు.
