ఆరోగ్య సేవల కోసం ఏఐ ప్లాట్ఫారమ్: టేక్ సొల్యూషన్స్ ప్రకటన

ఆరోగ్య సేవల కోసం ఏఐ ప్లాట్ఫారమ్: టేక్ సొల్యూషన్స్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: ఆరోగ్య రంగం కోసం ఏఐ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్​లో టేక్ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలోని 370 బిలియన్ డాలర్లుగా ఉన్న  హెల్త్ కేర్ సెక్టార్‌‌‌‌లో మార్పులు తీసుకురావడమే ఈ వేదిక ప్రధాన లక్ష్యం. 

ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, క్లినిక్‌‌‌‌లు ఏఐ సేవలను సులభంగా పొందేందుకు ఇది ఒక డిజిటల్ మౌలిక సదుపాయంగా పనిచేస్తుంది. ఈ ప్లాట్‌‌‌‌ఫారమ్ ద్వారా రోగ నిర్ధారణ ప్రక్రియలు వేగవంతం అవుతాయి. డాక్టర్లు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే క్లినికల్ డేటా సపోర్ట్ సిస్టమ్స్ అందుబాటులోకి వస్తాయి. 

ఆసుపత్రుల పనితీరును మెరుగుపరుస్తూ, రోగుల రద్దీని తట్టుకునేలా వ్యవస్థలు రూపుదిద్దుకుంటాయి. 2030 నాటికి అంతర్జాతీయ ఏఐ మెడికల్ మార్కెట్ 180 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా.